తెలంగాణ

telangana

ETV Bharat / state

త్యాగానికి ప్రతీకైన బక్రీద్​కు ప్రత్యేక ప్రార్థనలు - bakrid

బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మంలో ముస్లింలు సామూహికంగా మసీదులకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్​కుమార్, మేయర్ పాపాలాల్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

త్యాగానికి ప్రతీకైన బక్రీద్​కు ప్రత్యేక ప్రార్థనలు

By

Published : Aug 12, 2019, 1:39 PM IST

ఖమ్మం జిల్లాలో బక్రీద్​ను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామునే పెద్ద ఎత్తున మసీదులకు వెళ్లి నమాజ్ చేశారు. తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చిన్నారులు ప్రత్యేక వస్త్రధారణతో వచ్చి అందరినీ ఆకట్టకున్నారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్​కుమార్, మేయర్ పాపాలాల్​ ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని ప్రధాన మండలాల్లో ఉన్న మసీదుల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

త్యాగానికి ప్రతీకైన బక్రీద్​ వేళ ప్రత్యేక ప్రార్థనలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details