ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బడి బాట కార్యక్రమంలో ఎమ్మెల్యే రాములు నాయక్ పాల్గొన్నారు. విద్యార్థులకు కేసీఆర్ కిట్లు, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. పేద ప్రజలకు నాణ్యమైన విద్యనందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ప్రధానంగా గురుకుల పాఠశాలలను పెంచి ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని రాములు నాయక్ తెలిపారు. పిల్లలందరినీ సర్కారు బడులకు పంపిస్తూ ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు.
వైరాలో కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం - వైరాలో కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం
ఖమ్మం జిల్లా వైరాలో బడిబాట కార్యక్రమానికి ఎమ్మెల్యే రాములు నాయక్ హాజరయ్యారు. పిల్లలందరినీ తల్లిదండ్రులు సర్కారు బడికే పంపాలని కోరారు.
వైరాలో కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం