ఆయుర్వేద వైద్యులు కూడా శస్త్ర చికిత్సలు చేయవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నూతన జీవోలను వ్యతిరేకిస్తూ ఖమ్మంలో ఐఎంఏ వైద్యులు ధర్నా చేశారు. బస్టాండ్ ఎదుట ఏర్పాటు చేసిన శిబిరంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు.
బస్టాండ్ ఎదుట ఐఎంఏ వైద్యుల ధర్నా - ఖమ్మం జిల్లా తాజా వార్తలు
ఆయుర్వేద వైద్యులు కూడా శస్త్ర చికిత్సలు చేయొచ్చంటూ కేంద్రం ఇచ్చిన కొత్త జీవోలను వ్యతిరేకిస్తూ ఖమ్మంలో ఐఎంఏ వైద్యులు ధర్నా నిర్వహించారు. కేవలం ఆరు నెలల కోర్సు చేసి శస్త్ర చికిత్సలు ఎలా చేస్తారని వైద్యులు నిలదీశారు.
బస్టాండ్ ఎదుట ఐఎంఏ వైద్యుల ధర్నా
మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఆందోళన నిర్వహించారు. సుమారు ఎనిమిదేళ్లు చదివిన తర్వాత ఒక ఎంబీబీఎస్ వైద్యుడికి శస్త్రచికిత్సలు చేయటానికి అర్హత లభిస్తే... కేవలం ఆరు నెలల కోర్సు చేసి శస్త్ర చికిత్సలు ఎలా చేస్తారని వైద్యులు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి :మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు... ఫిర్యాదు చేసిన మహిళ