ఖమ్మం జిల్లా వైరా ప్రాంతీయ రవాణా కార్యాలయంలో కరోనా వైరస్‌పై వాహనదారులకు అవగాహన కల్పించారు. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆఫీసుకు వచ్చే వాహనదారులు... చేతులు శుభ్రం చేసుకుని ముఖానికి మాస్క్ ధరించి వచ్చేందుకు సౌకర్యాలు కల్పించారు.
ఖమ్మం ఆర్టీఏ ఆఫీసులో కరోనాపై అవగాహన కార్యక్రమం
ఖమ్మం జిల్లా వైరాలోని ప్రాంతీయ రవాణా కార్యాలయంలో కరోనా వైరస్‌పై ఎంవీఐ సలహాలు, సూచనలు అందించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు మాస్కులు ధరించి కార్యాలయం లోనికి వెళ్తున్నారు.
మాస్కులు ధరించే కార్యాలయానికి రావాలి : ఎంవీఐ
కార్యాలయానికి వచ్చే వాహనాదారులకు చేతులు కడుక్కోవడంపై సూచనలు అందించారు. హస్తాలతో ఇతరులను, వస్తువులను తాకకుండా ఉండటానికి జాగ్రత్తలుపై ఎంవీఐ శంకర్‌నాయక్ క్షుణ్ణంగా వివరించారు. ఈ క్రమంలో వాహనదారులు మాస్క్‌లు ధరించి లోనికెళ్తున్నారు.
ఇవీ చూడండి : స్నేహితుల వద్దకు వెళ్లొస్తానని చెప్పి.. అనంతలోకాలకు
TAGGED:
mvi office lo avagahana