ఖమ్మం జిల్లాలో వైరా పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ సేఫ్టీ అంశంపై పట్టణ వాసులకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప క్షేత్రం పరిధిలోని శబరి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సదస్సుకు ఖమ్మం పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ హాజరయ్యారు. సైబర్ నేరాలు వంటి పలు అంశాలపై ఆయన చర్చించారు. ప్రతి ఒక్కరు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని... వాటి బారిన పడకుండా చూసుకోవాలని సూచించారు. సదస్సులో ఏసీపీ ప్రసన్నకుమార్, సీఐ రమాకాంత్ వివిధ మండలాల ఎస్సై పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అవగాహన సదస్సు - సైబర్ నేరాలపై అవగాహన సదస్సు
సైబర్ నేరాలపై అవగాహన పెంచుకొని వాటిని బారిన పడకుండా జాగ్రత్త వహించాలని విద్యార్థులకు ఖమ్మం పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ సూచించారు.
![సైబర్ నేరాలపై అవగాహన సదస్సు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4124682-204-4124682-1565696998778.jpg)
సైబర్ నేరాలపై అవగాహన సదస్సు