కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వాహన చట్టంను వ్యతిరేకిస్తూ ఖమ్మంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. పెవిలియన్ మైదానం నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. దేశంలో పేదలను వాహన రంగంలో ఉన్న కార్మికులను నడ్డివిరిచే ఈ చట్టం ఎందుకు ఉపయోగపడుతుందని ప్రశ్నించారు. చట్టాన్ని ఉపసంహరించుకోకపోతే ఉద్యమం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
' నూతన వాహన చట్టంపై ఆటో డ్రైవర్ల గరగరం ' - నూతన వాహన చట్టం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వాహన చట్టం పట్ల ఖమ్మం జిల్లాలో ఆటో డ్రైవర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ రోజు చట్టంను వ్యతిరేకిస్తూ ర్యాలీని నిర్వహించారు.
![' నూతన వాహన చట్టంపై ఆటో డ్రైవర్ల గరగరం '](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4300362-351-4300362-1567253820419.jpg)
' నూతన వాహన చట్టంపై ఆటో డ్రైవర్ల గరగరం '