ఖమ్మం జిల్లా వైరా మండలం విప్పలమడకలో రైతు డేవిడ్ మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని పంటను సాగు చేశాడు. కళ్లంలో ఆరబోసి కుప్పచేసి ఉన్న మిర్చికి రాత్రి వేళలో దుండగులు నిప్పుపెట్టారు. ఆరుగాలం పండించిన పంట బూడిదైంది. మిరపకాయలు కాలుతున్న సమాచారం తెలుసుకున్న గ్రామ ప్రజాప్రతినిధులు, రైతులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.
50 క్వింటాళ్ల మిరపకు నిప్పుపెట్టిన దుండగులు - khammam district news today
ఖమ్మం జిల్లా వైరా మండలం విప్పలమడకలో కంచె డేవిడ్ అనే రైతుకు చెందిన 50 క్వింటాళ్ల మిరపకాయలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టి దగ్ధం చేశారు. సుమారు ఆరు లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపారు.
![50 క్వింటాళ్ల మిరపకు నిప్పుపెట్టిన దుండగులు Assassins who set fire to 50 quintals of chilli at khammam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5989209-242-5989209-1581059081555.jpg)
50 క్వింటాళ్ల మిరపకు నిప్పుపెట్టిన దుండగులు
ఫైర్ ఇంజిన్ వచ్చేలోపు కాయలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ఏడాది ధర ఆశాజనకంగా ఉండటం వల్ల ఆ పంటపైనే ఆశలు పెట్టుకున్న బాధిత రైతు బోరున విలపించాడు. సుమారు ఆరు లక్షల నష్టం వాటిల్లినట్లు కన్నీరుమున్నీరయ్యాడు. రైతు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
50 క్వింటాళ్ల మిరపకు నిప్పుపెట్టిన దుండగులు
ఇదీ చూడండి :మేడారానికి పోటెత్తిన భక్తులు... గవర్నర్ల మొక్కులు
TAGGED:
ఖమ్మం జిల్లా వార్తలు