తెలంగాణ

telangana

ETV Bharat / state

సంగమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి జాతరకు ఏర్పాట్లు - maha shivratri in khammam district

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని సంగమేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనా నిబంధనల మధ్య భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురవ్వకుండా అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు.

arrangements for sangameshwara jathara on the eve of maha shivratri at paleru
సంగమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి జాతరకు ఏర్పాట్లు

By

Published : Mar 10, 2021, 1:28 PM IST

మహాశివరాత్రి ఉత్సవాలకు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని సంగమేశ్వర స్వామి ఆలయం ముస్తాబవుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎండలు మండిపోతున్నందున గుడి చుట్టూ పందిళ్లు ఏర్పాటు చేసి భక్తులు స్వామి దర్శనం చేసుకునే వీలు కల్పించారు. భక్తుల సౌకర్యార్థం స్నానఘట్టాలు ఏర్పాటు చేసిన అధికారులు.. సీసీ కెమెరాలు బిగించారు. మూడ్రోజుల పాటు జరిగే ఈ జాతరకు ఉమ్మడి జిల్లా నుంచి లక్షకు పైగా భక్తులు హాజరవుతారని ఆలయ అధికారులు తెలిపారు. 200 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జాతరకు ప్రత్యేకంగా 70 బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

అగ్నిమాపక సిబ్బందిని అందుబాటులో ఉంచారు. గుడికి కిలోమీటర్ దూరంలో వాహనాల పార్కింగ్​ సౌలభ్యం కల్పించారు. వేసవి సమీపించినందున తాగునీరు, మజ్జిగ ప్యాకెట్ల కౌంటర్లు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details