ఖమ్మం జిల్లా వైరా పోలింగ్ కేంద్రంలో తెరాస, ప్రత్యర్థి పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓటేసేందుకు ఎమ్మెల్యే రాములునాయక్ రాగా.. ఆయనతో పాటు మరికొందరు ప్రజా ప్రతినిధులు వచ్చారు. ప్రత్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
వైరాలో అధికార, ప్రత్యర్థి పార్టీల నేతల మధ్య వాగ్వాదం - argument between trs and other party leaders in wyra khammam
ఖమ్మం జిల్లా వైరాలోని పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే రాములు నాయక్తో పాటు కొందరు ప్రజా ప్రతినిధులు రాగా ప్రత్యర్థి పార్టీల నాయకుల అడ్డుకున్నారు. రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.
![వైరాలో అధికార, ప్రత్యర్థి పార్టీల నేతల మధ్య వాగ్వాదం argument between trs and other party leaders in wyra khammam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5795814-thumbnail-3x2-vagvadam.jpg)
వైరాలో అధికార, ప్రత్యర్థి పార్టీల నేతల మధ్య వాగ్వాదం
ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. వారి మధ్య వాదనలు పెరగడం వల్ల ఏసీపీ సత్యనారాయణ ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇరువర్గాలను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించారు.
వైరాలో అధికార, ప్రత్యర్థి పార్టీల నేతల మధ్య వాగ్వాదం
ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'
TAGGED:
వైరాలో తెరాసతో గొడవ