తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఏఏకు వ్యతిరేకంగా అఖిలపక్ష సమావేశం - సీఏఏకు వ్యతిరేకంగా మధిరలో సమావేశం

ఖమ్మం జిల్లా మధిరలో సీఏఏ వ్యతిరేకంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని అభిప్రాయపడ్డారు.

anti caa all party meeting in madhira
సీఏఏకు వ్యతిరేకంగా అఖిలపక్ష సమావేశం

By

Published : Mar 8, 2020, 7:47 PM IST

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పౌరసత్వ సవరణ బిల్లుతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని మధిర పట్టణసీఏఏ వ్యతిరేక కమిటీ కన్వీనర్ ఎస్​ఏ ఖాదర్​ అన్నారు. ఖమ్మం జిల్లా మధిర రిక్రియేషన్ క్లబ్​లో పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

రాజ్యాంగ విరుద్ధంగా పౌరసత్వ బిల్లును పౌరులపై రుద్దాలని ప్రదాని మోదీ చూస్తున్నారని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. అన్ని పక్షాలు ఏకమై ప్రభుత్వం దిగొచ్చేలా చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, తెరాస, ఐద్వా నాయకులు పాల్గొన్నారు.

సీఏఏకు వ్యతిరేకంగా అఖిలపక్ష సమావేశం

ఇదీ చూడండి:తెలంగాణ బడ్జెట్‌.. రూ.1,82,914 కోట్లు

ABOUT THE AUTHOR

...view details