ఖమ్మం జిల్లాలో కొత్తగా మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. నగరంలోని సరిత క్లినిక్ సెంటర్లో ఓ వ్యక్తికి కరోనా సోకింది. అతను విజయవాడ చెందిన వ్యక్తి కాగా... ఇటీవల అత్తారింటికి వచ్చాడు. జ్వరం రావటం వల్ల అనుమానంతో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటీవ్‌గా తెలింది.
ఖమ్మంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు - corona positive case in Khammam
ఖమ్మంలోని మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విజయవాడకు చెందిన వ్యక్తి పట్టణంలోని తన అత్తారింటికి వచ్చాడు. కరోనా లక్షణాలు ఉండటం వల్ల అతను వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీనివల్ల అధికారులు అప్రమత్తమయ్యారు.
ఖమ్మంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు
కుటుంబ సభ్యులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని కరోనా వార్డుకి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనివల్ల జిల్లాలో ఇంతవరకు నమోదైన కేసుల సంఖ్య 31కి చేరింది. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య సిబ్బంది సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేసి బ్లీచింగ్ చల్లారు. అధికారులు ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించి దిగ్బంధించారు.