చేతి వృత్తి దారులుగా పనిచేసే రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ ప్రకటించడం పట్ల ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
'చేతివృత్తిదారులకు ఉచిత విద్యుత్ అభినందనీయం' - babu jagjivan ram jayanthi news
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ అన్నారు. చేతివృత్తిదారులకు ఉచిత విద్యుత్ ప్రకటించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్
పేదల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, నిరుపేదలైన చేతివృత్తి దారులకు ఉచిత విద్యుత్ ప్రకటించడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, స్థానిక ప్రజాప్రతినిధులు, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కుర్చీ వేసుకొని ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నారు.. ఏమైంది?: చాడ