ఆకలితో అలమటిస్తున్న అడవి బిడ్డల కుటుంబాలకు తామున్నామంటూ చేయూత నందించారు ఖమ్మం జిల్లాకు చెందిన అన్నం సేవా ఫౌండేషన్ సభ్యులు. ఖమ్మం పట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏన్కూరు మండలం కొత్త మేడేపల్లి అడవిలోని గొత్తి కోయల కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాలు, దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేశారు.
అడవి బిడ్డల ఆకలి తీర్చిన అన్నం సేవా ఫౌండేషన్
సమాజంలో ఒక్క పూట అన్నం లేక పస్తులతో బాధపడుతున్న ఎంతో మందిని చూస్తూ ఉంటాము. వారి దుస్థితిని చూసి కొందరు జాలిచూపుతారే గానీ సాయం చేయడానికి ముందుకురారు. ఖమ్మం జిల్లాకు చెందిన అన్నం సేవా ఫౌండేషన్.. అన్నార్తుల స్థితికి చలించి పోయి తామున్నామంటూ ముందుకు కదిలింది. ఆకలితో అలమటిస్తున్న అడవి బిడ్డలను ఈ ఫౌండేషన్ సభ్యులు ఆదుకున్నారు.
అడవి బిడ్డల ఆకలి తీర్చిన అన్నం సేవా ఫౌండేషన్
అడవిలో నివాసం ఉంటున్న గిరి పుత్రుల సమస్యలు తెలుసుకున్న డాక్టర్ అన్నం శ్రీనివాసరావు... దాతల సాాయంతో సహకారం అందించారు. ప్రత్యేకంగా లారీలో 20 క్వింటాళ్ల బియ్యం, కూరగాయలు, పండ్లు, దుస్తులు, దుప్పట్లు అందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవలు అందిస్తామని సభ్యులు తెలిపారు. పెద్ద ఎత్తున సహకారం అందించిన దాతలకు అడవి బిడ్డలు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి:దట్టంగా పొగమంచు.. జాగ్రత్తలతో అధిగమించు
Last Updated : Jan 4, 2021, 3:35 PM IST