తెలంగాణ

telangana

ETV Bharat / state

'అన్నం' పెట్టే సంస్థకు ఆదరణ కరవు!

జీవిత చరమాంకంలో ఆదరణ లేని అనాథలు వారు... అందరూ ఉండీ అనాథలైన వారు మరికొందరు.. మానసిక స్థితి బాగోలేక రోడ్లపై తిరుగుతున్న వారు ఇంకొందరు.. ఇలా ఎందరికో ఆశ్రయం ఇచ్చిన సంస్థకు ఇప్పుడు కష్టకాలం వచ్చింది. ఇన్నాళ్లు ఈ భారం పోషించిన ఫౌండర్ అన్నం శ్రీనివాసరావు.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. 20 మందితో ప్రారంభమై.. 400 మందికి చేయూతనిస్తున్న ఈ ఫౌండేషన్ దాతల ఆదరణ కోసం చేయిచాస్తోంది.

By

Published : Jun 13, 2020, 1:26 PM IST

Updated : Jun 13, 2020, 1:37 PM IST

Annam Seva Foundation Struggles in Khammam
'అన్నం' పెట్టే సంస్థకు ఆదరణ కరవు!

'అన్నం' పెట్టే సంస్థకు ఆదరణ కరవు!

మానవసేవే మాధవసేవ అని నమ్మిన ఒక చిరుద్యోగి అన్నం పేరుతో ఆశ్రమాన్ని ప్రారంభించి, దశాబ్దకాలంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ అభాగ్యులకు ఆశ్రయం కల్పిస్తున్నాడు. వెుుదట తన ఇంటిలోనే 20 మందికి ఆశ్రయం కల్పించిన అన్నం శ్రీనివాసరావు, అన్నార్థులు పెరగటంతో ఆశ్రమాన్ని వేరే చోటుకు మార్చాల్సి వచ్చింది. అంతేగాక, వృద్ధులు, మానసికస్థితి బాగాలేనివారికి ఆశ్రయం కల్పించడంతో, చుట్టుపక్కనవాళ్లు చీదరించుకునేవారు. సొంత భవనం లేకపోవటం వల్ల ఆశ్రమాన్ని ఇప్పటివరకు ఆరుసార్లు వేరేచోట్లకు మార్చాల్సివచ్చింది.

రోడ్డు మీద మతిస్థిమితం లేకుండా తిరిగేవారిని, 'నా' అనేవారులేని అభాగ్యులెందరికో మేమున్నామంటూ ఆశ్రయం కల్పించిన అన్నం నిర్వాహకులు ప్రభుత్వ చేయూతలేకున్నా కష్టనష్టాలకోర్చి ముందుకు సాగుతూనే ఉన్నారు. వారి సంకల్పాన్ని గుర్తించిన జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, రోటరీనగర్​లో ఖాళీగా ఉన్న ఓ ప్రభుత్వ భవనాన్ని సంస్థను వినియోగించుకుంనేందుకు అప్పగించారు. కానీ సొంతభవనం లేకపోవటం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.

అభాగ్యులందరికీ అన్నం పెట్టి ఆదరించిన అమ్మలాంటి సంస్థ ఇపుడు ఆపన్నహస్తం చాచి దాతలకోసం చూస్తోంది. ప్రభుత్వం చొరవచూపి స్థలం కేటాయించి, భవనం నిర్మిస్తే గూడు, నీడలేనివారు తలదాచుకుంటారని అన్నం ఫౌండేషన్​లో బతుకీడుస్తున్న అభాగ్యులు వేడుకుంటున్నారు. మానవతావాదులు ముందుకొచ్చి ఆసరానివ్వాలని అర్థిస్తున్నారు.

ఇది చదవండి:పోడుదారులకు హక్కులు కల్పించాలంటూ ఆందోళన

Last Updated : Jun 13, 2020, 1:37 PM IST

ABOUT THE AUTHOR

...view details