ఒంటరిగా గుడి వద్ద కూర్చున్న ఓ వృద్ధుడుకి అన్నం సేవా సంస్థ సభ్యులు ఆశ్రయం కల్పించారు. ఖమ్మంలోని చైతన్య నగర్ కట్టమైసమ్మ ఆలయం వద్ద ఓ వృద్ధుడు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి వరకు దిక్కుతోచని స్థితిలో ఒంటరిగా ఉన్నాడు. గమనించిన స్థానికులు అన్నం సేవా సంస్థ నిర్వాహకుడు శ్రీనివాసరావుకు సమాచారం అందించారు.
వృద్ధుడిని చేరదీసిన అన్నం స్వచ్ఛంద సేవా సంస్థ - Annam Foundation latest news
ఖమ్మం జిల్లా కేంద్రంలోని చైతన్య నగర్ కట్టమైసమ్మ వద్ద దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ వృద్ధుడిని అన్నం స్వచ్ఛంద సంస్థ చేరదీసింది. అనంతరం బాధితుడ్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది.
వృద్ధుడిని చేరదీసిన అన్నం స్వచ్ఛంద సేవా సంస్థ
సంస్థ సభ్యులు వచ్చి వృద్ధుడి వివరాలను ఆరా తీయగా బాధితుడు తన పేరు వెంకయ్య అని మాత్రమే చెప్పాడని నిర్వాహకుడు వెల్లడించారు. తన చిరునామా సహా ఇతర వివరాలేవీ చెప్పలేదని ఆయన తెలిపారు. తప్పిపోయి వచ్చాడా లేక ఎవరైనా వదిలేసి పోయారా అనే అనుమానంతో ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యులు వస్తే వారికి అప్పగిస్తామని స్పష్టం చేశారు.