ఖమ్మం అర్బన్ మండలం అల్లిపురం వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రాత్రి కురిసిన వర్షానికి మొక్కజొన్నలు పూర్తిగా తడిసిపోయాయి. మక్కలు తీసుకొచ్చి పది రోజులైనా ఇంతవరకు కొనుగోలు చేయలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
అకాల వర్షంతో ఆవేదన చెందిన అన్నదాత - ఖమ్మం అల్లిపురం వద్ద రాత్రి వర్షానికి తడిసిన మొక్కజొన్నలు
రాత్రి కురిసిన అకాల వర్షంతో మక్కలు తడిసి ముద్దయ్యాయి. ఖమ్మం జిల్లాలో అల్లిపురం వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాల్లో పోసిన మక్కలు పూర్తిగా తడిశాయి. ఈ నేపథ్యంలో రైతులు తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
అకాల వర్షంతో ఆవేదన చెందిన అన్నదాత
తడిసిన మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వర్షానికి మండలంలోని కూరగాయల పంటలు సైతం దెబ్బతిన్నాయి. సుమారు 50 ఎకరాల మునగతోట గాలివానకు నేలకొరిగింది. పంట నష్టం సుమారు లక్ష వరకు ఉంటుందని రైతులు చెబుతున్నారు.
ఇదీ చూడండి :డ్రైవర్ లేని బస్సు..అలా దూసుకెళ్లింది..