ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అన్న ఫౌండేషన్ అండగా నిలిచింది. ఖమ్మం జిల్లా మధిరలోని 25 మంది ఉపాధ్యాయ కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు బియ్యాన్ని ఫౌండేషన్ ఛైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మేళం శ్రీనివాస్ యాదవ్ అందజేశారు.
ప్రైవేట్ ఉపాధ్యాయులకు అండగా అన్నా ఫౌండేషన్ - ఖమ్మం జిల్లా వార్తలు
ఖమ్మం జిల్లా మధిరలోని ప్రైవేట్ ఉపాధ్యాయుల కుటుంబాలకు అన్నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంపిణి చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మేళం శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
![ప్రైవేట్ ఉపాధ్యాయులకు అండగా అన్నా ఫౌండేషన్ ప్రైవేట్ ఉపాధ్యాయులకు అండగా అన్నా ఫౌండేషన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8068797-986-8068797-1595005000406.jpg)
ప్రైవేట్ ఉపాధ్యాయులకు అండగా అన్నాప్రైవేట్ ఉపాధ్యాయులకు అండగా అన్నా ఫౌండేషన్ ఫౌండేషన్
లాక్డౌన్ సమయంలో ఉపాధిలేక కుటుంబ పోషణ భారమైన వారికి తనవంతు సాయం చేస్తున్నట్లు తెలిపారు. వైరస్ పట్ల అజాగ్రత్త వద్దని, పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా ముఖ్యమని సూచించారు.