తెలంగాణ

telangana

ETV Bharat / state

కుదేలైన నిర్మాణరంగం... పెరిగిన ధరలతో పనుల్లో నెలకొన్న స్తబ్ధత - construction industry updates

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మాణ రంగ పరిశ్రమ కొట్టుమిట్టాడుతోంది. కరోనాకు ముందు తర్వాత పరిస్థితులు విశ్లేషిస్తే తీవ్ర స్తబ్ధత కనబడుతోంది. భారీగా పెరిగిన సిమెంట్, ఉక్కు ధరలతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పనిలేక భవన నిర్మాణ కూలీలు అవస్థలు పడుతున్నారు.

కుదేలైన నిర్మాణరంగం... పెరిగిన ధరలతో పనుల్లో నెలకొన్న స్తబ్ధత
కుదేలైన నిర్మాణరంగం... పెరిగిన ధరలతో పనుల్లో నెలకొన్న స్తబ్ధత

By

Published : Jan 20, 2021, 5:17 AM IST

కుదేలైన నిర్మాణరంగం... పెరిగిన ధరలతో పనుల్లో నెలకొన్న స్తబ్ధత

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నిర్మాణ రంగం అభివృద్ధి... మూడడుగులు ముందుకు ఏడడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతోంది. కరోనాకు ముందు ఉభయ జిల్లాల్లో జోరుగా సాగిన స్తిరాస్థి వ్యాపారం, నిర్మాణాలకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. లాక్‌డౌన్‌ అనంతరం మెల్లగా కోలుకుని గాడిన పడుతున్న తరుణంలో భారీగా పెరిగిన భవన నిర్మాణ వ్యయం.. నిర్మాణ రంగానికి మళ్లీ అడ్డుకట్ట వేసింది.

నిలిచిన పనులు...

సిమెంట్, ఉక్కు, ఎలక్ట్రికల్‌ వస్తువులు సహా కూలీల వేతనాలు భారీగా పెరగడం వల్ల రెండు జిల్లాల్లో దాదాపు 50 శాతం నిర్మాణాలు నిలిచిపోయాయి. సీలింగ్, ప్లంబింగ్, శానిటరీ, టైల్స్ ధరలు బాగా పెరగడం వల్ల ఇల్లు, అపార్ట్​మెంట్ల నిర్మాణాలు ముందుకుసాగడం లేదు.

గగనంగా మారిన ఉపాధి...

పనులు ఆగిపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి గగనంగా మారుతోంది. ఉభయ జిల్లాలో సుమారు లక్ష మంది వరకు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 65 వేల మంది, ఖమ్మం జిల్లాలో 35 వేల మంది దాకా ఉన్నారు. గతంలో అడ్డా మీదకు వచ్చిన ప్రతీ కార్మికుడికి పని దొరికేది. కానీ ప్రస్తుతం అందరికీ ఉపాధి దొరకడం లేదు. గతంలో ప్రారంభించిన నిర్మాణాలు తప్ప కొత్తవి జరగడం లేదని... అందుకే పని దొరకడం కష్టంగా మారుతోందని కార్మికులు చెబుతున్నారు.

ఇబ్బందులు...

గతంలో ఒక ఇంటి నిర్మాణం కోసం 10 మంది పనిచేస్తే ప్రస్తుతం ఐదుగురే పనిచేయాల్సి వస్తోంది. మిగిలిన వారికి ఉపాధి దొరకడం లేదు. వీరి కుటుంబాలు గడవడమే గగనంగా మారింది. పరోక్షంగా నిర్మాణ రంగంపై ఆధారపడిన వడ్రంగి, తదితర కూలీలూ పని దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ధరలు అదుపుచేసి నిర్మాణ రంగాన్ని ఆదుకోవాలని... బిల్డర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి: కంటోన్మెంట్​ను కైవసం చేసుకుంటాం : లక్ష్మణ్​

ABOUT THE AUTHOR

...view details