తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజాప్రతినిధుల కాళ్లుమొక్కే దుస్థితి పోవాలి: చెరుకు సుధాకర్ - Khammam District latest News

ప్రజాప్రతినిధుల కాళ్లమీద నిరుద్యోగులు పడే పరిస్థితులు పోవాలని ఇంటి పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. యువత తలెత్తి తిరగాల్సిన రోజులు రావాలని ఆకాంక్షించారు. ఇల్లెందులో ఆయన ప్రచారం నిర్వహించారు.

an-incident-in-which-terasa-candidate-palla-rajeshwar-reddy-was-confronted-during-the-mlc-election-campaign-has-become-a-campaign-issue-for-many-opponents
నిరుద్యోగ యువత తలెత్తి తిరుగాల్సిన రోజులు రావాలి

By

Published : Feb 5, 2021, 1:02 PM IST

ప్రజాప్రతినిధుల కాళ్లమీద నిరుద్యోగులు పడే పరిస్థితులు తెలంగాణలో పోవాలని ఇంటి పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. యువత తలెత్తి తిరుగాల్సిన రోజులు రావాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కాళ్లను ఓ నిరుద్యోగిని మొక్కే ప్రయత్నం చేస్తున్న ఫోటో చూపిస్తూ సుధాకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అధికారంలో శాశ్వతంగా ఏ కులాన్నో, మతాన్నో, కుటుంబాన్నో ఉంచకూడదని తెలిపారు. అది దేశానికి, రాష్ట్రానికి, మీ ప్రాంతానికి విఘాతం అని ఇల్లెందులో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని యువత, ఉపాధ్యాయ, ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. చట్టసభల్లో నిరుద్యోగ సమస్యలపై ప్రశ్నించే వారికి అవకాశం ఇవ్వాలని కోరారు.

పల్లా రాజేశ్వర్ రెడ్డి కాళ్లను మొక్కే ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగిని

ఇదీ చదవండి:కోహ్లీ 31లోనైనా 71 చేరుకుంటాడా?

ABOUT THE AUTHOR

...view details