Rythu Gosa BJP Bharosa Sabha In Khammam : కాంగ్రెస్ 4జీ.. బీఆర్ఎస్ 2జీ.. ఎంఐఎం 3జీ పార్టీలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amith Shah) ఎద్దేవా చేశారు. సోనియా కుటుంబం కోసం కాంగ్రెస్ పని చేస్తే.. కల్వకుంట్ల కుటుంబం కోసం బీఆర్ఎస్ పని చేస్తుందని ఆరోపణలు చేశారు. ఖమ్మం జిల్లాలో జరిగిన రైతు గోస - బీజేపీ భరోసా(Rythu Gosa BJP Bharosa Sabha)బహిరంగ సభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆయన తిరుపతి వెంకటేశ్వరుడిని, స్తంభాద్రి లక్ష్మీనరసింహుడిని స్మరించుకుని ప్రసంగం ప్రారంభించారు. అంతకు ముందు తెలంగాణ విమోచనకు పోరాడిన స్వాతంత్య్ర యోధులకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత ప్రసంగం ప్రారంభిస్తూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేశారు.
"కేసీఆర్ సర్కారును గద్దె దింపాలా వద్దా.. బీజేపీ సర్కారు కావాలా వద్దా?. కేసీఆర్ సర్కారు తిరోగమనం ప్రారంభమైంది. ఇక నూకలు చెల్లాయి. తెలంగాణలో త్వరలో కమలం వికసిస్తుంది. ఈసారి సీఎం అయ్యేది కేసీఆర్ కాదు.. కేటీఆర్ కాదు.. బీజేపీ నేత మాత్రమే. కేసీఆర్ ప్రజలకు ఎన్నో హామీలిచ్చి మోసం చేశారు. తెలంగాణలో ఈసారి అధికారంలోకి వచ్చేది మోదీ పార్టీ మాత్రమేనని" కేంద్రమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
Telangana BJP MLA Candidates List : 35 మందితో BJP తొలి జాబితా.. సెప్టెంబరు 17 తర్వాతే ప్రకటన
Amith Shah Comments On CM KCR :హైదరాబాద్ విముక్తి చెంది 75 ఏళ్లు నిండాయని.. తెలంగాణ అమరవీరుల కలలను కేసీఆర్ నెరవేర్చలేకపోయారని అమిత్ షా విమర్శించారు. ఒవైసీ పక్కన కూర్చుని సీఎం కేసీఆర్.. తెలంగాణ అమరవీరులను అవమానిస్తున్నారని ఆవేదన చెందారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఇప్పుడు ఎంఐఎం నేత ఒవైసీ చేతుల్లో ఉందని స్పష్టం చేశారు. ఎంఐఎం చేతిలో స్టీరింగ్ ఉన్న కారు మనకు అవసరమా అని ప్రశ్నించారు. అరెస్టులతో బీజేపీ నేతలను భయపెట్టవచ్చని.. ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని అన్నారు. అలా చేస్తే అది బీఆర్ఎస్కే నష్టమని తెలిపారు.