తెలంగాణ

telangana

ETV Bharat / state

Amit Shah Khammam Meeting : ఖమ్మంలో 'రైతు గోస- బీజేపీ భరోసా' సభతో.. రాష్ట్రంలో వేడేక్కిన రాజకీయం

Amit Shah Khammam Meeting: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మం గడ్డపై గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టిన భారతీయ జనతా పార్టీ ఎట్టకేలకు సత్తా చాటింది. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో.. ఉనికి లేదంటూ అపవాదు ఎదుర్కొంటున్న చోటే తమ బలాన్ని నిరూపించుకోవాలనుకుంది. అనుకున్నదే లక్ష్యంగా ఖమ్మం వేదికగా 'రైతు గోస- బీజేపీ భరోసా' పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపినట్లైంది.

BJP Public Meeting In Khammam
Rythu Gosa BJP Bharosa Sabha In Khammam

By ETV Bharat Telangana Team

Published : Aug 28, 2023, 7:25 AM IST

Amit Shah Khammam Public Meeting Success ఖమ్మంలో రైతు గోస బీజేపీ భరోసా సభ విజయవంతం వేడేక్కిన రాజకీయం

Amit Shah Khammam Meeting :ఆదివారం సాయంత్రం ఖమ్మం ఎస్​ఆర్ అండ్​ బీజీఎన్​ఆర్(BGNR) కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు భారీగా ప్రజానీకం తరలివచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పొరుగు జిల్లాల నుంచి కార్యకర్తలు తరలిరావడంతో మధ్యాహ్నం నుంచే సభ ప్రాంగణం సందడిగా మారింది. అమిత్ షా(Union Home Minister Amit Shah) సభకు చేరుకునే సమయానికే సభా ప్రాంగణమంతా కార్యకర్తలతో కోలహాలం నెలకొంది.

Rythu Gosa BJP Bharosa Sabha In Khammam :వాస్తవానికి జూన్​లోనే బీజేపీ బహిరంగ సభ నిర్వహించాలని అనుకున్నప్పటికీ.. అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈసారి అమిత్ షా పర్యటన ఖరారు కావడంతో కమలం పార్టీ నేతలంతా బహిరంగ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం సుమారుగా 3 గంటల ప్రాంతంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కేంద్రమంత్రి అమిత్​ షా హెలిక్యాప్టర్‌ ద్వారా ఖమ్మం చేరుకున్నారు. ఖమ్మంలో రైతు గోస - బీజేపీ భరోసా సభ(Rythu Gosa BJP Bharosa Sabha) వేదికగా కాంగ్రెస్‌, బీఆర్ఎస్ సర్కార్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. పదేళ్లలో అన్ని వర్గాలను బీఆర్ఎస్ ప్రభుత్వం వంచించిందని అమిత్‌ షా ఆరోపించారు. కేసీఆర్‌, బీజేపీ ఏకమవుతాయని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేచేవేళ్లలో(Congress Chevella Prajagarjana Sabha) అబద్దాలు చెప్పారని షా ఆక్షేపించారు. కేసీఆర్‌ పక్కన ఒవైసీ ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందేనన్న ఆయన.. కేసీఆర్‌, ఒవైసీతో బీజేపీ కలిసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

Mallikarjuna Kharge Release 12 Points SC And ST Declaration : చేవెళ్ల సభలో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్​.. విడుదల చేసిన ఖర్గే

BJP Leaders Fires On CM KCR in Khammam Meeting :ఖమ్మం సభలో రాష్ట్ర బీజేపీ నేతలు సైతం బీఆర్ఎస్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. 9 ఏళ్లుగా ప్రజలను మోసం చేసి ఎన్నికలుండడంతో మరోసారి మోసం చేయడానికి సిద్ధమయ్యారంటూ ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా బీజేపీ నాయకులు(BJP Leaders) అమిత్ షాకు గజమాలతో సన్మానం చేశారు. బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి అమిత్ షాకు ధనుస్సు బహుకరించగా షా ఎక్కుపెట్టారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలన్న లక్ష్యంతో బీజేపీ వేసిన అడుగులు విజయవంతమైనట్లేనని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.

BJP Public Meeting In Khammam :నాయకులంతా కలిసికట్టుగా పనిచేయడంతో బహిరంగ సభ విజయవంతమైందని నాయకులు తెలిపారు. బహిరంగ సభలో బండి సంజయ్, ఈటల రాజేందర్ ప్రసంగాలు కార్యకర్తల్ని ఉర్రూతలూగించాయి. గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. అమిత్ షా డీకే అరుణను శాలువాతో సన్మానించారు. సభలో సేవ్ తిరుమల అన్న ప్లకార్డును ప్రజలు ప్రదర్శించారు. బహిరంగ సభలో పలువురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

Amit Shah Speech At Rythu Gosa BJP Bharosa Sabha In Khammam : 'కాంగ్రెస్‌ 4జీ.. బీఆర్​ఎస్​ 2జీ.. ఎంఐఎం 3జీ పార్టీలు'

Minister Harish Rao Comments On Amit Shah : 'సీఎం పదవి కాదు కదా.. ఈసారి సింగిల్​ డిజిట్​ సాధించేందుకు పోరాడండి'

ABOUT THE AUTHOR

...view details