కార్మికుల దీక్షను భగ్నం చేయటాన్ని నిరసిస్తూ... ఖమ్మం జిల్లా మధిరలో అఖిలపక్షం బంద్కు పిలుపునిచ్చింది. కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ... డిపో ఎదుట నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.
కార్మికులకు మద్దతుగా మధిరలో అఖిలపక్షం బంద్ - tsrtc latest news
ఖమ్మం జిల్లా మధిరలో ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్షాలు బంద్ నిర్వహించాయి. డిపో వద్ద బస్సులను బయటకు రాకుండా కార్మికులు, నాయకులు అడ్డుకున్నారు.
కార్మికులకు మద్దతుగా మధిరలో అఖిలపక్షం బంద్
అఖిలపక్ష నాయకుల దీక్షను భగ్నం చేస్తూ... పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులకు నిరసనగా బంద్ చేపట్టిన వివిధ పార్టీల నాయకులు... డిపో నుంచి బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. విద్యా, వ్యాపార సంస్థలను మూసివేయాలని కోరారు.
ఇదీ చూడండి: 'నా పేరు మధ్యప్రదేశ్.. నా కొడుకు పేరు భోపాల్'