ఐఐటీ జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఖమ్మం విద్యార్థులు సత్తా చాటారు. న్యూవిజన్ కళాశాలకు చెందిన ఐ.నితిన్ 99.99 పర్సంటైల్‌తో ఆల్ ఇండియా ఎస్టీ కేటగిరిలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు.
జేఈఈ మెయిన్స్.. ఎస్టీ కేటగిరీలో ఖమ్మం విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ - ఐఐటీ జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఖమ్మం
దేశంలో ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో.. బీటెక్ కోర్సుల ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. ఆల్ ఇండియా ఎస్టీ కేటగిరిలో ఖమ్మం జిల్లాకు చెందిన నితిన్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఫిబ్రవరిలో రాసిన పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.
జేఈఈ మెయిన్స్.. ఎస్టీ కేటగిరీలో ఖమ్మం విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్
మరో 5గురు విద్యార్థులు 99 పర్సంటైల్ సాధించారని కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్‌రావు తెలిపారు. తమ కళాశాల విద్యార్థులు హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో అందరి కంటే ముందు నిలిచారన్నారు. ప్రతి ఏడాది ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:నేటి నుంచి గురుకులాల టీజీసెట్ దరఖాస్తులు