ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వైరా పురపాలక కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానాల తీర్పులు అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
పారిశుద్ధ్య కార్మికులను క్రమబద్ధీకరించాలని ఏఐటీయూసీ ధర్నా - aituc latest news
పురపాలక, నగరపాలక సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులను క్రమబద్ధీకరించాలని కోరుతూ ఖమ్మం జిల్లా వైరాలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి తాత్కాలిక, పొరుగు సేవల సిబ్బంది సేవలు చేస్తున్నారని చెప్పారు.
![పారిశుద్ధ్య కార్మికులను క్రమబద్ధీకరించాలని ఏఐటీయూసీ ధర్నా aituc protest at wyra in kammam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8596766-506-8596766-1598631851478.jpg)
పారిశుద్ధ్య కార్మికులను క్రమబద్ధీకరించాలని ఏఐటీయూసీ ధర్నా
రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సిబ్బందితో సమానంగా పనిచేస్తున్న కార్మికులకు సమాన వేతనం ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే రాయితీలు అమలు చేయాలని కోరారు.
ఇదీ చూడండి:జీఎస్టీ పరిహారంపై బిహార్ రూటే సెపరేటు