సహకార రంగం బలోపేతం ద్వారానే కార్పొరేట్ శక్తుల దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ సహకార స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు శత వసంతాల వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఖమ్మం డీసీసీబీ 100 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రత్యేక శిలాఫలకాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామ నాగేశ్వరరావు, టెస్కాబ్ ఛైర్మన్ కొండ్రు రవీందర్ రావుతో కలిసి ఆవిష్కరించారు.
'సహకార స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలి' - khammam news
సహకార స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సహకార రంగం బలోపేతం ద్వారానే కార్పొరేట్ శక్తుల దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు శతాబ్ది ఉత్సవాలను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు.

సహకార సంఘం అధ్యక్ష పదవి స్థాయి నుంచే ముఖ్యమంత్రిగా ఎదిగిన కేసీఆర్‌కు రైతు సమస్యలపై పూర్తి అవగాహన ఉందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. అందువల్లే రైతు సంక్షేమం కోసం... సహకార వ్యవస్థ బలోపేతానికి సీఎం ప్రణాళికలు రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. ఖమ్మం డీసీసీబీ బ్యాంకును రాబోయే రోజుల్లో కరీంనగర్‌కు దీటుగా మార్చేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. శతవసంతాల సందర్భంగా గతంలో పీఏసీఎస్ అధ్యక్షులుగా సుదీర్ఘ కాలం పనిచేసిన పలువురిని సన్మానించారు.
ఇదీ చదవండి:టీకా పంపిణీపై సీఎంలతో నేడు ప్రధాని భేటీ