ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గట్టు సింగారంలో ఉద్రిక్తత నెలకొంది. కల్తీ మద్యం తాగడం వల్లనే వెంకటేష్ అనే వ్యక్తి మరణించాడని ఆరోపిస్తూ.. బంధువులు బెల్ట్ షాప్ ఎదుట ఆందోళన చేపట్టారు.
గట్టు సింగారం బెల్ట్ షాప్ వద్ద వారంరోజుల క్రితం వెంకటేష్ అనే యువకుడు మద్యం తాగాడు. అనంతరం గొంతు బొబ్బలు వచ్చాయి. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వెంకటేష్ మృతిచెందాడు.