తెలంగాణ

telangana

ETV Bharat / state

మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు... జిల్లాలో కలవరం

ఖమ్మం జిల్లాలో కరోనా పాజిటివ్​ కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. 8 పాజిటివ్​ కేసులు నమోదైనప్పటికీ... పూర్తిగా కోలుకున్న జిల్లాలో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతుండటం అందరిని కలవరపెడుతోంది.

Again second corona case has been registered in Khammam district
మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు... జిల్లాలో కలవరం

By

Published : May 21, 2020, 11:14 AM IST

ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్​ కేసులు కలకలం రేపుతున్నాయి. 8 పాజిటివ్​ కేసులు నమోదైనప్పటికీ... పూర్తిగా కోలుకున్న జిల్లాలో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఇప్పుడు అధికారుల్ని కలవరానికి గురిచేస్తోంది.

జిల్లా గ్రీన్​జోన్​గా మారిన తర్వాత రెండ్రోజుల క్రితం మధిర మండలం మహదేవపురంలో తొలికరోనా కేసు నమోదుకాగా.. తాజాగా రెండో పాజిటివ్ కేసు కూడా నమోదైంది. పెనుబల్లి మండలం వీఎం బంజరలో ఓ మహిళకు కరోనా సోకింది. బతుకుదెరువు కోసం కుటుంబంతో సహా పుణె వెళ్లి...అక్కడ ఉపాధి లేక ఈ నెల 13న వీఎం బంజరకు వచ్చింది. ఏడుగురు కుటుంబ సభ్యుల్లో ఓ మహిళకు కరోనా పాజిటివ్ తేలింది. అప్రమత్తమైన వైద్య శాఖ అధికార యంత్రాంగం... గ్రామంలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

మొత్తం 37 మందిని ఖమ్మం క్వారంటైన్ కేంద్రానికి తరలించడంతో పాటు.. .మరో 13 మందిని హోం క్వారంటైన్ చేశారు. పాజిటివ్ సోకిన వ్యక్తి సెకండరీ కాంటాక్టు వివరాల్ని వైద్య సిబ్బంది సేకరిస్తున్నారు. మరోవైపు.. రెండో దఫాలో తొలికేసు నమోదైన మహదేవపురంను వైద్య శాఖ పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంది. వైద్యశాఖ సిబ్బంది ఇంటింటి సర్వే చేపడుతున్నారు. గ్రామానికి చెందిన మొత్తం 51 మందిని క్వారంటైన్​కు తరలించారు. వీరిలో కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఏడుగురి నమూనాలు సేకరించి కరోనా పరీక్షల కోసం వరంగల్​కు పంపించారు. ఇక జిల్లాలో వెలుగుచూసిన రెండు కరోనా పాజిటివ్ కేసులు కూడా పుణె నుంచి వచ్చిన వారిలోనే వెలుగుచూశాయి. కరోనాతో అట్టుడుకి పోతున్న మహారాష్ట్ర నుంచి జిల్లాకు వచ్చిన వారిలో కరోనా కేసులు తేలుతుండటం కలవరానికి గురిచేస్తోంది. ఇటువంటి వారిని జిల్లా సరిహద్దుల్లోనే పరీక్షలు చేశాకే....స్వగ్రామానికు పంపాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నిన్న మొన్నటివరకు జిల్లాలో కేసులేమీ లేకుండా ఉన్న ఖమ్మం జిల్లాలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్న పరిణామాలు కలకలం రేపుతున్నాయి.

ఇవీ చూడండి:రాష్ట్రంలో ఐదు ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి

ABOUT THE AUTHOR

...view details