ఆర్టీసీ ఐకాస పిలుపు మేరకు ఛలో ట్యాంక్‌బండ్‌కు బయలుదేరిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్టీసీ కార్మికులు, రాజకీయ పార్టీల నాయకులకు నిర్బంధాలు తప్పలేదు. నిన్న సాయంత్రం నుంచే హైదరాబాద్‌కు పయనమైన ఆందోళనకారుల్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడిక్కడ పోలీసులు కట్టడి చేశారు.
ఛలో ట్యాంక్ బండ్: ఎక్కడికక్కడ అరెస్టులు... - ADVANCE ARREST AT KHAMMAM DISTRICT
ఆర్టీసీ ఐకాస పిలుపు మేరకు ఛలో ట్యాంక్‌బండ్‌కు బయలుదేరిన ఆర్టీసీ కార్మికులను, రాజకీయ పార్టీల నాయకులను ఎక్కడిక్కడా ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఛలో ట్యాంక్ బండ్: ఎక్కడికక్కడ అరెస్టులు ...
ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, భద్రాచలంలో ముందస్తు అరెస్టులు చేశారు. పలుచోట్ల సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేటు వాహనాల్లో వెళ్లిన కార్యకర్తలు మాత్రం ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఇక ఖమ్మం జిల్లా నుంచి మరిన్ని వివరాలు ఈటీవీ భారత్ ప్రతినిధి లింగయ్య అందిస్తారు.
ఇదీ చూడండి: నేడే అయోధ్య భూవివాదం కేసుపై తీర్పు