తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎస్సీ కార్పోరేషన్ రుణాల కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్​

లబ్ధిదారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి సొమ్ము కాజేసిన నిందితులను ఖమ్మం పోలీసులు జైలుకు పంపారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

By

Published : Apr 23, 2019, 12:43 PM IST

వివరాలు వెల్లడించిన ఏసీపీ వెంకట్రావు

ఖమ్మంలో సంచలనం రేపిన ఎస్సీ కార్పోరేషన్‌ రుణాలు దారి మళ్లింపు కేసు ఓ కొలిక్కి వచ్చిందని నగర ఏసీపీ వెంకట్రావు తెలిపారు. వేముల సునీల్‌ ఈ కుంభకోణంలో సూత్రధారని తేల్చారు. 43 మంది లబ్ధిదారుల నుంచి కోటి 4లక్షల రూపాయలు తన ఖాతాలో జమ చేయించుకున్నాడని వెల్లడించారు. ప్రధాన నిందితుడు తన కుమారుల ఖాతాలో 36 లక్షలు, మరోకరి ఖాతాలో 17లక్షల రూపాయలు జమ చేశాడని గుర్తించారు. నిందితులను నుంచి ఒక కారు, మూడు ఏయిర్‌ గన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ స్పష్టం చేశారు. ఈ కేసులో మొత్తం 17 మంది నిందితులను గుర్తించామని త్వరలోనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ వెంకట్రావు తెలిపారు.

వివరాలు వెల్లడించిన ఏసీపీ వెంకట్రావు

ABOUT THE AUTHOR

...view details