తెలంగాణ

telangana

ETV Bharat / state

మధిర డిపోలో హైదరాబాద్​ ఏసీ బస్సును ప్రారంభించిన సీఎల్పీనేత భట్టి - battivikramarka started ac bus services at madira

ఖమ్మం జిల్లా మధిర ఆర్టీసీ డిపో నుంచి హైదరాబాద్​కు ఏసీ బస్సు సర్వీసులు మొదలయ్యాయి. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మం జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు ఈ సేవలను ప్రారంభించారు.

AC bus services started from Mathira RTC Depot to hyderabad
మధిర ఆర్టీసీ డిపో నుంచి ప్రారంభమైన ఏసీ బస్సు సర్వీసులు

By

Published : Jan 4, 2021, 10:35 PM IST

ఖమ్మం జిల్లా మధిర ఆర్టీసీ డిపో నుంచి హైదరాబాద్​కు ఏసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ డిపోకు ఇటీవల మంజూరైన రాజధాని ఏసీ బస్సు సర్వీసును.. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మం జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజుతో కలిసి ప్రారంభించారు.

పువ్వాడ చొరవతో ..

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు రవాణా కూడలిగా ఉన్న మధిర ఆర్టీసీ డిపో నుంచి నిత్యం రాజధాని హైదరాబాద్​కు ప్రయాణికులు అధిక సంఖ్యలో రాకపోకలు చేస్తుంటారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం.. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవతో రాజధాని ఏసీ బస్సు మంజూరైనట్లు ఖమ్మం జడ్పీ ఛైర్మన్ తెలిపారు.

ఇదీ చదవండి:రైతులకు, కేంద్రానికి కుదరని సయోధ్య- 8న మళ్లీ చర్చలు

ABOUT THE AUTHOR

...view details