కొవిడ్ బాధితులకు ఉచితంగా ఆహారం అందిస్తూ ఈ కష్టకాలంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ యువకుడు. కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయిన వారి దగ్గరకు వెళ్లడానికి కుటుంబసభ్యులే జంకుతున్న నేపథ్యంలో చిరునామాలు తెలుసుకొని సాయం చేస్తున్నాడు ఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన ప్రతాప్. ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ను నడిపించే తనకు కరోనా బాధితులకు సాయం చేయాలని అనిపించిందని చెప్పాడు.
కొవిడ్ బాధితుల పాలిట ఆపద్బాంధవుడు ఆ యువకుడు
కరోనా మహమ్మారి సోకిన వ్యక్తుల దగ్గరకు వెళ్లడానికి కుటుంబ సభ్యులే జంకుతున్నారు. కనీసం కడచూపునకు వెళ్లడానికి భయపడుతున్నారు. కానీ ఆ యువకుడు మాత్రం కొవిడ్ బాధితుల పాలిట ఆపద్బాంధవు అయ్యాడు. వైరస్ నిర్ధరణ అయిన వారి ఇళ్లకు స్వయంగా వెళ్లి ఉచితంగా ఆహార పదార్థాలను అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
కరోనా బాధితులకు ఉచిత ఆహారం, కరోనా బాధితులకు సాయం చేస్తున్న యువకుడు
ఈ విపత్కర సమయంలో నలుగురికి సాయం చేయాలనే ఉద్దేశంతోనే వెంటనే వాట్సాప్ గ్రూపుల్లో తన మొబైల్ నంబర్ ఇచ్చి... పాజిటివ్ అని తేలిన వారికి ఉచితంగా ఆహార పదార్థాలు అందజేస్తానని ప్రకటించినట్లు వెల్లడించాడు. కరోనా బాధితులకు ఆహారం, పండ్లు వంటివి ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేస్తున్నట్లు వివరించాడు. గతేడాది నిత్యవసర సరుకులను అందజేసినట్లు తెలిపాడు. కరోనా బాధితులకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నాడు.
ఇదీ చదవండి:కరోనా పరీక్ష ఆలస్యం.. అవుతోంది ప్రాణాంతకం!