కరోనాతో మృతిచెందిన వారిని చూస్తేనే అంత్యక్రియలకు సైతం జంకుతున్న వారిని చూశాం. తీరా బంధువులు, ఆత్మీయులు కూడా దగ్గరికి వచ్చేందుకే భయపడుతున్న పరిస్థితులను చూస్తున్నాం. కానీ ఖమ్మం జిల్లాకేంద్రంలో విచిత్ర సంఘటన జరిగింది. కరోనాతో పోరాడి మృతి చెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాసరావు ముద్దు పెట్టుకున్నారు
కరోనా మృతదేహాన్ని ముద్దు పెట్టుకున్నసామాజిక సేవకుడు - మృతదేహం
కరోనా ఎందరో ఆత్మీయులను దూరం చేస్తోంది. అయినవారిని అందనంత దూరానికి తీసుకెళ్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రేమ, ఆత్మీయత, అనుబంధాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. అలాంటి సమయంలో కరోనాతో పోరాడి మృతి చెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాసరావు ముద్దు పెట్టుకున్నారు. మృతదేహం నుంచి వైరస్ వ్యాపించదని అవగాహన కోసమే ఇలా చేశానని చెబుతున్నారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాకేంద్రంలో జరిగింది.
సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాసరావు
ఈ విధంగా వైరస్ వ్యాపించదని అవగాహన కల్పించడం కోసమే ఇలా చేశానని అంటున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోనే ఈ విధంగా చేశాడు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో బంధువులు దగ్గరకు వచ్చేందుకు భయపడుతున్నా.. ఆయన మాత్రం మృతదేహాన్ని కౌగిలించుకున్నారు. రెండో దశ ప్రారంభం అయినప్పటి నుంచి సుమారు వందల మృతదేహాలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చూడండి:ఈటల రాజేందర్ భూవ్యవహారంలో మరోసారి తనిఖీలు