వీరంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీలు. విజయవాడ నుంచి నాలుగు రోజుల క్రితం బయలుదేరారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడేనికి శుక్రవారం రాత్రి చేరుకొని బస్‌షెల్టర్‌లో తలదాచుకున్నారు. తమలో ఒక కూలీకి కాలు విరిగినా అలాగే కుంటుకుంటూ దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించాడని తోటివారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూలీల గోస: విరిగిన కాలుతో 100 కిలోమీటర్ల ప్రయాణం
సొంతూళ్లకు వెళ్లే క్రమంలో వలస కూలీలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఖాళీ కడుపులతో.. కమిలిపోయే ఎండలోనూ తమ నడక సాగిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ కూలీ విరిగిన కాలుతో కుంటుకుంటూ దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించాడు.
కూలీల గోస: విరిగిన కాలుతో 100 కిలోమీటర్ల ప్రయాణం
TAGGED:
100 km with a broken leg