తెలంగాణ

telangana

ETV Bharat / state

kid suffering lung disease : ఓ చిన్నారి "ఊపిరి వేదన" : దాతల సాయం అర్థిస్తోన్న తల్లిదండ్రులు

suffering lung disease : ఊపిరితిత్తులు చెడిపోయిన ఆ చిన్నారికి ఆక్సిజన్‌ సిలిండరే ఆధారం. ఆడిపాడే వయసులో... ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరవుతోంది. సరిగా శ్వాస అందక క్షణమొక గండంగా బతుకుపోరాటం సాగిస్తోంది. చిన్నారికి మెరుగైన వైద్యం కోసం మానవతామూర్తులు ఆపన్నహస్తం అందించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

kid suffer lung disease
kid suffer lung disease

By

Published : Dec 2, 2021, 5:40 PM IST

ఓ చిన్నారి "ఊపిరి వేదన" : దాతల సాయం అర్థిస్తోన్న తల్లిదండ్రులు

suffering lung disease : ఆక్సిజన్‌ సిలిండర్‌ ద్వారా శ్వాస తీసుకుంటున్న ఈ చిన్నారి పేరు ఛైత్ర. మహబూబాబాద్‌ జిల్లా గార్లకు చెందిన గోపగాని అశోక్‌, శ్రీవిద్యల కుమార్తె. అశోక్‌ ఖమ్మంలో ఓ ప్రైవేటు కంపెనీలు గుమస్తాగా పని చేస్తున్నాడు. ఛైత్ర... గతేడాది జూన్‌లో కరోనా బారిన పడి కోలుకుంది. వైరస్ ప్రభావంతో చిన్నారి ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. గుంటూరుతోపాటు హైదరాబాద్‌, ఖమ్మం, సూర్యాపేటల్లో వైద్యసేవలు అందించారు. ఊపిరితిత్తుల మార్పిడి ఒక్కటే పరిష్కారం అని వైద్యులు సూచిస్తున్నారు. అందుకు రూ.50లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో ఆ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతోంది.

దాతల సాయం అర్థిస్తోన్న చిన్నారి

చిన్నారి ఊపిరిపై కొట్టిన కొవిడ్​

waiting for donears help: కరోనా తర్వాత ఛైత్ర ఆరోగ్యం క్షీణించింది. తీవ్ర శ్వాస ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆక్సిజన్‌ సిలిండర్‌ ద్వారా ప్రాణవాయువు అందిస్తున్నారు. ఈ సిలిండర్ల కోసం నిత్యం రూ.1,500కు పైగా ఖర్చవుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికే రూ.5లక్షల వరకు ఖర్చు చేశామని అంటున్నారు. బంగారం అమ్మి వైద్యం చేయిస్తున్నామని చిన్నారి తల్లి శ్రీవిద్య ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం కోసం మనసున్న మనుషులు ఆర్థిక సాయం చేయాలని వేడుకుంటున్నారు.

మా పాప గతేడాది జూన్​లో కొవిడ్​ బారిన పడింది. పోస్ట్​ కొవిడ్​ వల్ల ఊపిరితిత్తులపై ప్రభావం పడింది. అప్పటి నుంచి ఆస్పత్రులకు తిప్పుతూనే ఉన్నాము. వైద్యానికి భారీగా ఖర్చవుతోంది. మాకు అంత ఆర్థిక స్తోమత లేదు. పాప దక్కాలంటే కచ్చితంగా ఊపిరితిత్తులు మార్చాలని వైద్యులు చెబుతున్నారు. ఎప్పుడూ ఆక్సిజన్​ సిలిండర్​తోనే ఊపిరి తీసుకుంటుంది. ఒక్క క్షణం తీసినా చాలా ఇబ్బంది అవుతుంది. - శ్రీవిద్య, ఛైత్ర తల్లి

దాతల సాయంతో..

ప్రస్తుతం ఖమ్మం సారథినగర్‌లోని శివాలయంలో కుటుంబం ఆశ్రయం పొందుతోంది. ఆలయ ప్రధాన అర్చకులు అన్ని ఖర్చులు భరిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు విన్నవించి ఆర్థిక సాయం చేయిస్తున్నారు.

ఆ చిన్నారికి ప్రతి రెండు గంటలకు రూ.1,500 ఖర్చు చేసి ఆక్సిజన్​ అందిస్తేనే ఆ పాప బతుకుతుంది. ఆక్సిజన్​ అందకపోతే రెండు నిమిషాలు కూడా ఉండలేదు. ఈ దేవాలయానికి వచ్చే భక్తులకు ఆ చిన్నారి కష్టాన్ని వివరించి వారి సహాయంతో ఆక్సిజన్​ సమకూర్చాము. పేదరికంలో మగ్గుతున్న ఆ చిన్నారి తల్లిదండ్రులు బిడ్డను బతికించుకోడానికి రూ. 50 లక్షలకు పైగా ఖర్చుచేయలేని పరిస్థితి. దయఉంచి అందరూ తమకు తోచిన సాయం చేసి బిడ్డ ఊపిరి నిలబెట్టాలని కోరుకుంటున్నాను. -ఉమామహేశ్వరరావు, అర్చకులు

స్పందించిన మంత్రి కేటీఆర్​

minister ktr respond: ఛైత్ర ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన కేటీఆర్‌... ఊపిరితిత్తుల మార్పిడికి సహకరిస్తామని తెలిపారు. నీలోఫర్‌ వైద్యులతో మాట్లాడి చికిత్సకు ఒప్పించారు.

ఇదీ చూడండి:KTR Help: 'రిజ్వానా' కేటీఆర్​ను కదిలించింది? ఎవరీ రిజ్వానా? కేటీఆర్ ఏం చేశారంటే?

ABOUT THE AUTHOR

...view details