తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రతే కాదు.. వైద్యసేవలు అందించడంలోనూ మేం ముందుంటాం - పాము కాటు వ్యక్తిని పోలీసు హాస్పటల్​లో చేర్పించారు

పటిష్ఠ భద్రతే కాదు.. వైద్యసేవలు అందించడంలోనూ తాము ముందుంటామని ఖమ్మం జిల్లా వైరా పోలీసులు అంటున్నారు. పాము కాటుకు గురైన రైతును ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందించి అందరి మన్ననలనూ పొందుతున్నారు.

A farmer who was bitten by a snake has been hospitalized by police in khammam
భద్రత కల్పించడంలోనే కాదు.. వైద్యసేవలు అందించడంలోనూ మేం ముందుంటాం

By

Published : Apr 25, 2020, 7:00 PM IST

తమ విధులతో పాటు వైద్యసేవల్లోనూ ప్రజలకు అండగా ఉంటూ వైరా పోలీసులు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పాముకాటుకు గురైన ఓ రైతును పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఖమ్మం జిల్లా గొల్లపుడి గ్రామానికి చెందిన రాజారావు అనే రైతు వరిగడ్డి కోస్తుండగా పాము కాటేసింది. స్థానికంగా వాహనాలు లేకపోవడం వల్ల చుట్టుపక్కల వారు 100కు ఫోన్‌ చేశారు.

వెంటనే స్పందించిన బ్లూకోట్స్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌, హోంగార్డు ముఖేశ్‌లు ఆ గ్రామానికి చేరుకుని వైరా ప్రభుత్వాసుపత్రికి బాధితున్ని తరలించారు. గ్రామంలో ఆర్‌ఎంపీలు కూడా లేకపోవడం వల్ల ప్రయాణంలోనే తోటి రైతులు, పోలీసులు ప్రాథమిక చికిత్స అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అతన్ని మెరుగైన వైద్యం కోసం వైద్యులు ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అందించిన ఈ సేవను పలువురు అభినందించారు.

ఇదీ చూడండి :ఆర్టీసీపై తీవ్రంగా పడిన కరోనా ప్రభావం

ABOUT THE AUTHOR

...view details