ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ఆళ్లపాడు గోవిందపురం గ్రామంలో ఓ రైతు వాటర్‌ట్యాంక్ ఎక్కి ఆవేదన వ్యక్తం చేశాడు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేయడం లేదని... అందుబాటులో లారీలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నాడు. లారీ పంపించాలంటే ప్రతి బస్తాకు రూ.10 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించాడు. తమ సమస్యను పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని సమీపంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు.
అన్నదాత ఆత్మహత్యకు సిద్ధపడితే గాని ధాన్యం కదలలేదు.. - grain purchasing in Khammam
ధాన్యం కొనుగోళ్ల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ ఓ రైతు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ఆళ్లపాడు గోవిందపురం గ్రామానికి చెందిన రైతు ఆత్మహత్య చేసుకుంటానని వాటర్‌ట్యాంక్ ఎక్కాడు.

ఖమ్మం జిల్లా వార్తలు
విషయం తెలుసుకున్న ఎంపీ నామ నాగేశ్వరరావు రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావుతో మాట్లాడి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. స్పందించిన అధికారులు గ్రామానికి రెండు లారీలు పంపించి సమస్యను పరిష్కరించారు.
ఇదీ చూడండి:PRC: ఉద్యోగులకు గుడ్‌న్యూస్... అమల్లోకి రానున్న పీఆర్‌సీ!!