నాడు నిజాం నవాబుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఆమె నేడు ప్రపంచాన్నే మృత్యుకోరల్తో చుట్టుముట్టేస్తున్న కరోనాను ధైర్యంగా ఎదుర్కొంది. ఖమ్మం జిల్లా మధిర మండలం అల్లినగరం గ్రామానికి చెందిన 94 ఏళ్ల రాజ్యలక్ష్మి బంధువుల ఇంటికి ఇటీవల కరీంనగర్ వెళ్లింది. అక్కడ కరోనా బారిన పడింది.
మనోధైర్యమే మందు... కరోనా నుంచి కోలుకున్న 94 ఏళ్ల బామ్మ - ఖమ్మం వార్తలు
కరోనా సోకిందనగానే వైరస్‌తో కంటే భయంతోనే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ ఖమ్మం జిల్లా మధిరకు చెందిన 94 ఏళ్ల వృద్ధురాలు కరోనాతో పోరాడి ఆరోగ్యంగా బయటపడింది.
మనోధైర్యమే మందు... కరోనా నుంచి కోలుకున్న 94 ఏళ్ల వృద్ధురాలు
జులై 7న కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం కరోనా నుంచి కోలుకుని ఈనెల 1న ఆరోగ్యంగా ఇంటికి చేరుకుంది. 94 ఏళ్ల వయసులో కూడా మనోధైర్యం కోల్పోకుండా కరోనాపై పోరాడి గెలిచింది.
ఇదీ చదవండి: రామాలయం భూమిపూజ- 10 కీలకాంశాలు