తెలంగాణ

telangana

ETV Bharat / state

విశ్రాంత పోలీసు ఇంట్లో దొంగతనం - CHORI

ఇంట్లో ఎవరూ లేకపోతే సరి. ఆ ఇల్లు ఎవరిదైనా సరే కన్నం వేసే వరకు ఊరుకోరు. ఇంట్లో ఉన్నవన్ని దోచుకొని ఇళ్లుని గుళ్ల చేస్తారు. తాజాగా విశ్రాంత పోలీసు ఇంట్లోనే దాదాపు 9 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు గుర్తుతెలియని దుండగులు.

పోలీసు ఇంట్లో దొంగతనం... 30 తులాల బంగారం చోరీ

By

Published : Mar 31, 2019, 7:34 PM IST

పోలీసు ఇంట్లో దొంగతనం... 30 తులాల బంగారం చోరీ
పట్టపగలే విశ్రాంత ఎస్సై ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దాదాపు 9 లక్షల రూపాయల విలువ చేసే 30 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు గుర్తుతెలియని దుడంగలు. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని సుందరయ్య నగర్​లో చోటు చేసుకుంది. శుభకార్యానికి వెళ్లి తిరిగివచ్చే సరికి దొంగతనం జరిగింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఏసీపీ ప్రసన్నకుమార్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం ద్వారా గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details