బిస్కెట్లు, చాక్లెట్ ప్యాకెట్ల డబ్బాల మధ్య గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్న భారీ మొత్తంలో గంజాయిని ఖమ్మం పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. భద్రాచలం నుంచి ఖమ్మం మీదుగా హైదరాబాద్ వైపు కంటైనర్లో అక్రమంగా తరలిస్తున్న రూ.36 లక్షల విలువ చేసే 3 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందుగా వచ్చిన సమాచారం ప్రకారం పోలీస్స్టేషన్ ఎదురుగా వాహనాల తనిఖీలు చేపట్టారు. కంటైనర్ను ఆపే ప్రయత్నం చేయగా... పోలీసులను చూసి డ్రైవర్ పారిపోయాడు. కంటైనర్ను తెరిచి చూడగా... భారీగా గంజాయి కట్టలు బయటపడ్డాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బిస్కెట్లు, చాక్లెట్ల మధ్యలో 3 క్వింటాళ్ల గంజాయి - GANJA SEIZED AT KHAMMAM
ఖమ్మంలో మూడు క్వింటాళ్ల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. బిస్కెట్లు, చాక్లెట్ల డబ్బాలు తరలిస్తున్న ఓ కంటైనర్లో గంజాయి దొరికింది. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు..
3 QUINTAL GANZA SEIZED BY POLICE AT KHAMMAM