తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈదురు గాలుల బీభత్సం.. భారీగా పంటనష్టం - rain god made a loss to farmers

వాతావరణ ప్రభావంతో రైతన్నలు కుదేలవుతున్నారు. అకస్మాత్తుగా వీచిన ఈదురుగాలులలకు ఖమ్మం జిల్లాలో మామిడి , మిరప పంట రైతులు తీవ్రంగా నష్టపోయారు.

బలమైన గాలుల వల్ల నేలరాలిన మామిడి కాయలు

By

Published : Mar 25, 2019, 3:21 PM IST

ఈదురు గాలులకు దెబ్బతిన్న మామిడి, మిరప పంటలు
ఖమ్మం జిల్లాలోని వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో వీచిన ఈదురు గాలులకు మామిడి, మిరప పంటలు దెబ్బతిన్నాయి. బలమైన గాలుల వల్ల మామిడి కాయలు నేలరాలాయి. ఇప్పటికే ఆయా రైతులు పత్తి, మిర్చి పంటలతో నష్టపోయారు. వాతావరణ మార్పులతో వచ్చిన ఈ గాలులు రైతన్నలకు తీవ్ర నిరాశను మిగిల్చాయి.వరుణుడు నష్టమే చేశాడు
గత నెలలో కురిసిన అకాల వర్షాలతో మిరపకాయలు తడిసి ముద్దయ్యాయి. మళ్లీ రెండోసారి అదే పరిస్థితి పునరావృతం అవటం కర్షకులను మరింత కుంగదీసింది. తల్లాడ, వైరా మండలాల్లో పలు చోట్ల ఇళ్లు నేలమట్టమయ్యాయి. బలమైన ఈదురు గాలులతో జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి.

ఇవీ చూడండి :భారత వైమానిక దళంలోకి 'చినూక్​' హెలికాప్టర్లు


ABOUT THE AUTHOR

...view details