తెలంగాణ

telangana

ETV Bharat / state

Corona Cases in gurukul school: గురుకులంలో కరోనా కలకలం.. 27 మంది విద్యార్థినులకు పాజిటివ్ - తెలంగాణ వార్తలు

Corona cases in school, Covid in gurukulam school
గురుకులంలో కరోనా కలకలం, విద్యార్థినులకు కొవిడ్ పాజిటివ్

By

Published : Nov 21, 2021, 12:41 PM IST

Updated : Nov 22, 2021, 11:30 AM IST

12:38 November 21

వైరా బాలికల గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

ఖమ్మం జిల్లా వైరాలోని తెలంగాణ గురుకుల పాఠశాల, కళాశాలలో కరోనా కలకలం రేగింది. 27 మంది విద్యార్థులకు కరోనా వైరస్‌ సోకింది. ఇటీవల ఇంటికి వెళ్లొచ్చిన ఓ విద్యార్థినికి అస్వస్థతగా ఉండటంతో సిబ్బంది కరోనా పరీక్షలు చేయించారు. ఫలితాల్లో ఆ విద్యార్థినికి పాజిటివ్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ లక్ష్మి... విద్యార్థినులందరికీ పరీక్షలు చేయించగా 27మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. తొలుత 13 మందికి పాజిటివ్ రాగా... ఆ తర్వాత మరో 14 మందికి సోకినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఫలితంగా కరోనా బారిన పడిన వారందరినీ ఇళ్లకు పంపించారు. ఈ విషయం తెలిసిన మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను కూడా ఇళ్లకు తీసుకెళుతున్నారు. 

ఇటీవలె ఓ పాఠశాలలోనూ..

ఇటీవలె నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని చెన్నారం గేట్ వద్ద ఉన్న గురుకుల బాలికల  పాఠశాలలో  విద్యార్థినులు, ఉపాధ్యాయులకు పాజిటివ్​గా నిర్ధరణ అయింది. కరోనా లక్షణాలున్న ఎనిమిది మంది విద్యార్థినులు, ఇద్దరు టీచర్లకు పరీక్షలు నిర్వహించగా వైరస్ సోకినట్లు తేలింది. వారిలో ఆరుగురు విద్యార్థినులు, ఇద్దరు టీచర్లను హోం క్వారంటైన్​కు పంపారు. మరో ఇద్దరు విద్యార్థినులను పాఠశాలలోనే క్వారంటైన్​లో ఉంచి చికిత్స అందించారు. అయితే స్కూల్​కు వచ్చినప్పుడు అందరు ఆరోగ్యంగానే ఉన్నట్లు ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. పిల్లలను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రుల వల్లే వైరస్ సోకి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటామని  ప్రధానోపాధ్యాయుడు పేర్కొన్నారు. 

తల్లిదండ్రుల్లో భయం..

సెప్టెంబరు 1 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కావడంతో కాస్త భయంతోనే తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గడంతో గురుకులాలు తెరిచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో విద్యార్థులు పాఠశాలలోని వసతి గృహాలకు చేరుకున్నారు. అంతా సవ్యంగా ఉందని తల్లిదండ్రులు అనుకునేలోపే... పాఠశాలలోని 13మంది విద్యార్థులకు వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. గతంలోనూ పలు పాఠశాలల్లో కొవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని చాలా స్కూళ్లలోని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఆ తర్వాత కాస్తు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. మళ్లీ విద్యార్థులపై కరోనా పంజా విసరడంతో మిగిలిన విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. 

దేశంలో కరోనా కేసులు

భారత్​లో కరోనా కేసులు (Corona cases in India) స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 10,488 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. వైరస్​ ​ధాటికి మరో 313 మంది మరణించారు. ఒక్కరోజే 12,329 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. ఫలితంగా రికవరీ రేటు 98.30 శాతానికి చేరింది. క్రియాశీల కేసుల సంఖ్య 2020 మార్చి నుంచి 0.36 శాతానికి తగ్గి.. 532 రోజుల కనిష్ఠానికి చేరింది. దేశంలో రోజువారీ కేసులు వరుసగా 44వ రోజు 20 వేల కంటే తక్కువగా నమోదయ్యాయి. 147 రోజులుగా రోజువారీ వైరస్​ కేసులు 50 వేలకు దిగువన నమోదవుతున్నాయి. దీంతో గచిడిన 48 రోజులుగా పాజిటివిటీ రేటు 2 శాతానికి(0.98) దిగువన నమోదవుతోంది. 58 రోజులుగా వారాంత (వీక్లీ) పాజిటివిటీ రేటు 2 శాతం (0.94శాతం) కంటే తక్కువగా ఉంది.

  • మొత్తం కేసులు :3,45,10,413
  • మొత్తం మరణాలు :4,65,662
  • యాక్టివ్​ కేసులు :1,22,714
  • కోలుకున్నవారు :3,39,22,037

ఇదీ చదవండి:BJP on Amaravathi Padayatra: రైతుల మహాపాదయాత్రకు భాజపా నేతలు..

Last Updated : Nov 22, 2021, 11:30 AM IST

ABOUT THE AUTHOR

...view details