పరిమితికి మించి ఇసుక తరలిస్తున్న 10 లారీలను ఖమ్మం జిల్లా ఏన్కూరు వద్ద పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీలను తనిఖీలు చేయగా.. 5 టన్నుల వరకు ఎక్కువ బరువుతో వెళ్తున్నట్లు తేలింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి భూగర్భగనుల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
నిత్యం వందలాది లారీలు భద్రాచలం నుంచి ఖమ్మం, హైదరాబాద్, సత్తుపల్లి ప్రాంతాలకు వెళ్తున్నాయని పోలీసులు తెలిపారు. తల్లాడ గ్రామం మీదుగా వెళ్లే రహదారితో పాటు ఏన్కూరు నుంచి జన్నారం మీదుగా పల్లిపాడు వెళ్లే రహదారిలోనూ నిత్యం లారీలు అధిక లోడుతో వెళ్తున్నాయని పోలీసులకు సమాచారం అందింది.