తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మంలో 1/3 మట్టి వినాయకులే - మట్టి గణపతులు

ఖమ్మం నగరంలో మట్టి గణేశ్​లకు ఆదరణ పెరుగుతోంది. ఈ సంవత్సరం మూడింట ఒక వంతు మట్టి వినాయకులే ప్రతిష్ఠించినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

ఖమ్మంలో 1/3 మట్టి వినాయకులే

By

Published : Sep 4, 2019, 8:04 PM IST

ఖమ్మంలో మట్టి గణపతులకు ఆదరణ పెరుగుతోంది. నగర వ్యాప్తంగా సుమారుగా 1100 విగ్రహాలు ప్రతిష్ఠించగా... 300 దాక మట్టి ప్రతిమలే ఉన్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సారి బ్రాహ్మణ బజార్‌ శివాలయం వద్ద ఏర్పాటు చేసిన 25 అడుగుల విశ్వరూప గణేశ్ మట్టి విగ్రహాం అందరిని ఆకర్షిస్తోంది. ఈ విగ్రహంలో విత్తన బంతులను పొందుపరిచినట్లు నిర్వహకులు తెలిపారు. తెరాస నాయకులు వద్దిరాజు రవిచంద్ర గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంవత్సరం మట్టి గణనాథులను భారీగా ప్రతిష్ఠించినందుకు ఆనందంగా ఉందన్నారు.

ఖమ్మంలో 1/3 మట్టి వినాయకులే

ABOUT THE AUTHOR

...view details