యువజన కాంగ్రెస్ నాయకుడు రాజశేఖర్‌రెడ్డిని కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దూషించడాన్ని యువజన కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు నాగశేఖర్ ఖండించారు. సీఎం కేసీఆర్ వెంటనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
'ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి' - కరీంనగర్ జిల్లా తాజా సమాచారం
యువజన కాంగ్రెస్ నాయకున్ని అసభ్య పదజాలంతో దూషించినందుకు కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను సస్పెండ్ చేయాలని యువజన కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు నాగశేఖర్ డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో సమస్యలపై ప్రశ్నించినందుకు ఫోన్లు చేసి బెదిరించడాన్ని ఖండిస్తున్నామన్నారు.
'ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి'
మానకొండూర్ నియోజకవర్గంలో సమస్యలపై ప్రశ్నించినందుకు ఫోన్లో బెదిరించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇలాంటి వారి వల్లే ఎస్సీ, ఎస్టీ చట్టాలు దిగజారిపోతున్నాయని విమర్శించారు. రాజశేఖర్‌రెడ్డికి యువజన కాంగ్రెస్ నాయకులు అండగా ఉంటారని ఆయన తెలిపారు.