organ donation in Karimnagar : చేతికొందొచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచాన పడ్డాడు. పరిస్థితి చేయి దాటి బ్రెయిన్ డెడ్ అయి నిర్జీవంగా పడి ఉన్న కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పుట్టెడు దుఃఖంలోనూ వారు తమ ఉదార గుణాన్ని చాటుకున్నారు. తమ కుమారుడి అవయవాలను దానం చేసి.. అతనికి పునర్జన్మనివ్వడమే కాకుండా.. ఎంతో మంది ప్రాణాలు కాపాడటానికి ముందుకొచ్చారు.
organ donation in Karimnagar : 'అవయవ దానం చేశాడు.. పునర్జన్మ ఎత్తాడు' - కరీంనగర్ తాజా వార్తలు
organ donation in Karimnagar : బ్రెయిన్‌డెడ్ అయి మరణించినా.. అవయవదానం చేసి పునర్జన్మ ఎత్తాడు ఓ యువకుడు. తమ కుమారుడు కన్నుమూశాడని పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు.. మరే ఇంట ఈ విషాదం జరగకూడదనుకుని అతని అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రంగశాయిపల్లి చెందిన యువకుడు గంగసాని శ్రీనివాస్ రెడ్డి(26) ఈ నెల 6న స్వగ్రామంలో బైక్ పై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతణ్ని సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స జరిపించారు. కానీ తలకు బలమైన గాయం కావడంతో బ్రెయిన్ డెడ్ గా వైద్యులు తెలిపారు. తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు అవయవదానం చేసేందుకు అంగీకరించారు. ఆసుపత్రి సిబ్బంది తుది లాంఛనాలు పూర్తి చేసి యువకుని మృతదేహాన్ని వారికి అప్పగించారు. అనంతరం స్వగ్రామానికి తీసుకువెళ్లి అంత్యక్రియలు జరిపారు.
ఇదీ చదవండి :Poor Farmer Cultivation: కాడెద్దుగా తాత.. అరకతో మనవడు.