ఒత్తిడిని అధిగమించి మానసికోల్లాసాన్ని పొందేందుకు యోగా అత్యుత్తమ మార్గమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీవీ కమలాసన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ పరేడ్ మైదానంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించి యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీ యోగాసనాలు వేశారు. అతనితోపాటు వివిధ విభాగాలకు చెందిన 500 మంది పోలీసులు భౌతిక దూరం పాటిస్తూ యోగాసనాలు వేశారు.
'యోగాసనాలు వేయడం వల్ల శారీరక మానసిక దృఢత్వం పెంపొందుతుంది. యోగా సాధన ద్వారా పలు దీర్ఘకాలిక వ్యాధులు నియంత్రణలో ఉంటాయి. యోగ - ధ్యానము సాధనాలు ప్రతి పౌరుడు దినచర్యలో భాగంగా అలవర్చుకోవాలి' అని సీవీ సూచించారు.