తెలంగాణ

telangana

ETV Bharat / state

నిండుకుండలా మారిన ఎల్లంపల్లి ప్రాజెక్టు - ELLAMPALLI

కాళేశ్వరం జలాలకు తోడు కడెం నుంచి వస్తున్న నీటిప్రవాహంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో జలకళ ఉట్టి పడుతోంది. కాళేశ్వరం మొదటి లింక్ ద్వారా వచ్చి చేరే నీటిని మధ్య మానేరుకు తరలించడం వల్ల ఎల్లంపల్లి ప్రాజెక్టు కీలకంగా మారింది.

నిండుకుండలా మారిన ఎల్లంపల్లి ప్రాజెక్టు

By

Published : Aug 7, 2019, 5:07 AM IST

Updated : Aug 7, 2019, 9:04 AM IST

మొన్నటి వరకు నీరు లేక వెలవెలబోయిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రస్తుతం జళకలతో ఉట్టిపడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా మారిన ఈ ప్రాజెక్టుకు అటు మేడిగడ్డ నుంచి, ఇటు కడెం జలాశయం నుంచి నీటి ప్రవాహం వస్తోంది. మేడిగడ్డ నుంచి నీటిని ఎల్లంపల్లిలోకి ఎత్తిపోయాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ... ప్రస్తుతం మధ్య మానేరుకు నీరు అందించే కార్యక్రమం కాస్త నెమ్మదిగా సాగుతోంది. జలాశయంలోని నీటి తరలింపు ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండగా... ఇన్‌ఫ్లో మాత్రం గంటగంటకు పెరుగుతూ నీటిని నిలుపుదల చేయలేని పరిస్థితి నెలకొంది. మొత్తం 20 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీరు పూర్తి స్థాయికి చేరింది. కడెం నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోను దృష్టిలో పెట్టుకొని 5 నుంచి 10 గేట్లు ఎత్తి గోదావరిలోకి వదులుతున్నారు. గేట్లు ఎత్తడం వల్ల ఇక్కడికి సందర్శకుల తాకిడి పెరిగింది.

నిండుకుండలా మారిన ఎల్లంపల్లి ప్రాజెక్టు
Last Updated : Aug 7, 2019, 9:04 AM IST

ABOUT THE AUTHOR

...view details