కరీంనగర్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. వ్యాపారస్థులు తమ తమ దుకాణాల్లో లక్ష్మీ దేవికి పూజలు చేశారు. అలాగే జిల్లాలో అనాదిగా వస్తున్న సమాధుల పూజ సంప్రదాయాన్ని కరీంనగర్ వాసులు భక్తి శ్రద్ధలతో పాటించారు.
దీపావళి సందర్భంగా కరీంనగర్లో సమాధులకు పూజలు - సమాధుల పూజలు
ఏటా దీపావళి సందర్భంగా పితృ దేవతలకు ప్రత్యేక పూజలు చేయడం అక్కడ ప్రత్యేకత. పండుగ రోజు... చనిపోయిన వారిని స్మరించుకుంటూ వారి సమాధుల వద్ద ఆయా కుటుంబీకులు పూజలు చేస్తారు. కరీంనగర్లో ఈ దీపావళి సందర్భంగా ఆ సంప్రదాయాన్ని పాటించారు.
దీపావళి సందర్భంగా కరీంనగర్లో సమాధులకు పూజలు
పితృ దేవతలను స్మరించుకుంటూ వారి సమాధుల వద్ద పూజలు చేస్తుంటారు. సమాధులకు సున్నాలు వేసి పూలతో అలంకరించారు. దీపాలు వెలిగించి టపాసులు పేల్చి వినూత్న పద్ధతిలో పూజలు నిర్వహించారు.
ఇదీ చదవండి:మనవడితో కలిసి టపాసులు కాల్చిన మంత్రి