కరీంనగర్ జిల్లా కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికులు కనీస వేతన బకాయిల కోసం ఆందోళనకు దిగారు. కలెక్టరేట్లో ఉన్న టవర్ ఎక్కిన కార్మికులు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కనీస వేతనం కింద కేవలం రూ.1,000 వేతనంతో పని చేస్తున్నామని వాపోయారు.
రాష్ట్ర వ్యాప్తంగా 53 వేల మంది కార్మికులు ఉన్నామని... కనీస వేతనం గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఓ ఆనంద్, వన్ టౌన్ సీఐ విజయ్ కుమార్ నచ్చజెప్పే యత్నం చేశారు. కలెక్టర్ రావాల్సిందేనని డిమాండ్ చేస్తూ భవనంపైనే కార్మికులు బైఠాయించారు.