తెలంగాణ

telangana

ETV Bharat / state

కామాంధుడికి ఉరి.. మహిళల సంబురాలు.. - కరీంనగర్

తొమ్మిది నెలల చిన్నారి అత్యాచారం నిందితుడికి ఉరి శిక్ష విధించడం పట్ల కరీంనగర్​లో మహిళలు సంబురాలు చేసుకున్నారు. వరంగల్​ ఫాస్ట్​ ట్రాక్​ కోర్టు ఇచ్చిన తీర్పు అభినందనీయమని పేర్కొన్నారు.

కామాంధుడికి ఉరి.. మహిళల సంబురాలు..

By

Published : Aug 8, 2019, 6:23 PM IST

కామాంధుడికి ఉరి.. మహిళల సంబురాలు..
తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం చేసినా నిందితుడు ప్రవీణ్​కు వరంగల్ జిల్లా న్యాయస్థానం ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పడంపై కరీంనగర్​లో మహిళలు సంబురాలు జరుపుకున్నారు. పట్టణంలోని విద్యానగర్​లో మిఠాయిలు పంచుకున్నారు. మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి జయకుమార్ ముందు నిందితుడు నేరం అంగీకరించడం వల్ల వరంగల్ ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అభినందనీయమన్నారు. ప్రభుత్వాలు ఇలాంటి కఠిన చట్టాలు తీసుకువచ్చి అమలు చేస్తే మరొకరు నేరం చేయరని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details